Wednesday, September 21, 2011

పరిచయము

                    ఆది కవి వాల్మీకి  విరచితమైన    సు౦దర  కావ్యాన్ని  అనువది౦చేట౦తటి  మేథావిని  కాకపోయినప్పటికీ  భావితరాల   వారికి  మార్గదర్శక౦గా ఉపయోగపడునటువ౦టిది మరియు  చదివిన  కొలదీ  అజరామరమై  అన౦త  అమృతధారలను   చిలకి౦చగల     రామాయణ  భా౦ఢారమును   తేటతెలుగున   అనువది౦చుటకు  పూజ్యలైన   శ్రీ హనుమనుగురుదేవుల ఆశీస్సులతో సాహసి౦పపూనాను.


                    ఇ౦దు ఏదైనా తప్పులు  దొర్లిన  సహృదయులై  మన్న౦చగలరని  ప్రార్థిస్తూ    స౦కలనాన్ని  ము౦దుగా  పాత్రలు వాటి ఔచిత్యములతో ప్రార౦భిస్తున్నాను.


ఇట్లు
తమ భవదీయుడు
పి. మహిధర్  రెడ్డి

Tuesday, April 12, 2011

ముందుమాట

                            మహాకవి వాల్మీకి రచించిన రామాయణమును తెలుగులో అనువదించుటకు నాకు అర్హత లేకపోయినా, ఉరుకుల పరుగుల మయమైన నేటి జీవిత గమనాన, ప్రతిదీ కంప్యూటర్ నందు పొండుపరచుచున్న ఈ యుగములో, తెలుగు చదివే అలవాటున్నప్పటికీ, పుస్తకాలు చదివే అలవాటులేక, ప్రతిదానికీ కంప్యూటర్ పైన ఆధారపడుతున్న ఈ యుగములో, రామాయణమును, అందులోని భావమును, అందుగల ప్రాసస్త్యమును, అందుండి మనం పాటించవలసిన సూత్రములు మన వారికి తెలుపాలన్న సంకల్పము చేసిన వాడినై, శారదా మాత కటాక్షము చేత, శ్రీ రామచంద్రుని కృప వలన, శ్రీ హనుమాను గురుదేవుని ఆశీస్సులతో నా ప్రయత్నము సఫలము చేయుచున్నవాడను.

                           అందుకు సహకరించిన వారందిరికి నా ధన్యవాదములు.

                          శ్రీ హనుమాను గురుచరణ సేవాభాగ్యము వలన, శ్రీ హనుమాను గురుదేవుని అసీర్వాదమహిమ వలన, లిఖితమై, నిర్మించబడుతున్న ఈ నవరసభరిత సమ్మోహన, సంతులిత, సంపూర్ణ గద్య కావ్యము "రామాయణము (తెలుగులో)", శ్రీ రామచంద్ర ప్రభువు పాదారవిన్దాలకు వినమ్రుడనై అంత్యంత భక్తి శ్రద్దలతో అంకితం చేస్తున్నాను.